Master EK Birthday – శతజయంతి ఉత్సవాలలో భాగంగా
Master EK Birthday
మాస్టర్ EK శతజయంతి ఉత్సవాలలో భాగంగా, తేది 11.08.2026 న మాస్టర్ EK గారి జన్మదిన సందర్భంగా, మాస్టర్ EK, Master KPK, Dr. K.S. Sastry గారి దివ్య ఆశీస్సులతో Master Homoeo Vaidyalayam, Akkayyapalem లో వేదపఠనం, గురుపాదుకా స్తోత్రం నిర్వహించబడినవి. ఉదయం 6 గంటలకు PRAYER జరిగింది.
తదుపరి జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ K.S. మాధవరావు గారిని, శ్రీ హనుమంతరావు గారిని, శ్రీ దీక్షితులు గారిని సత్కరించారు.
అనంతరం Master EK గారు ఇచ్చిన జన్మదిన సందేశం మరియు Dr. K.S. Sastry గారు ఇచ్చిన సందేశం ఆడియో రూపంలో వినిపించారు. ఆ సందేశాలు అందరికీ ఎంతో స్ఫూర్తిని కలిగించాయి.
తరువాత శ్రీ K. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ Master EK గారి జీవిత విశేషాలను, ఆయన అందిపుచ్చుకున్న యోగమును గురించి సంగ్రహంగా వివరించారు. అలాగే సాధకులకు Master EK గారు ఇచ్చిన సూచనలను సవివరంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సుమారు 75 మంది ఔత్సాహికులు పాల్గొని మాస్టర్ గారి అనుగ్రహానికి పాత్రులైనారు. తదుపరి ప్రసాద వితరణ జరిగింది. అనంతరం Dispensary Activity కి వెళ్లడం జరిగింది.
మధ్యాహ్నం 12 గంటల నుండి సేవా కార్యక్రమాలలో భాగంగా 250 మంది నిరుపేదలకు అన్నదానం, 150 మందికి వస్త్రదానం నిర్వహించారు. కార్యక్రమానికి రాలేని వారి వద్దకు వెళ్లి వస్త్రాలను అందించడం జరిగింది. అలాగే Dispensary ఆవరణలో 75 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలతో ఈనాటి Master EK గారి జన్మదిన వేడుకలు సార్థకంగా ముగిశాయి.