
మాస్టర్ సి.వి.వి. గారి 159వ జన్మదినోత్సవం
Master C.V.V. Birthday
మాస్టర్ సి.వి.వి. గారి 159వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, 04.08.2026 తేదీన మాస్టర్ ఇ.కె., మాస్టర్ కె.పి.కె. మరియు డా. కె.ఎస్.ఎస్. గారి దివ్య ఆశీస్సులతో అక్కయ్యపాలెంలోని మాస్టర్ హోమియో వైద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఉదయం 6 గంటలకు ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీ ఆర్.ఎస్. కృష్ణమూర్తి గారు, శ్రీ ఎం. హనుమంతరావు గారు మరియు శ్రీ కె. శ్రీనివాస్ గారు మాస్టర్ సి.వి.వి. గారి జీవిత విశేషాలు, ఆయన మానవాళికి అందించిన యోగమార్గం, దాని ప్రాముఖ్యత గురించి విపులంగా వివరించారు. “ఏకత్వమే యోగం” అని తెలియజేస్తూ, సమయపాలన మరియు విధేయత మాస్టర్ గారి యోగమార్గంలోని ప్రధాన అంశాలని పేర్కొన్నారు.
ఉదయం 8 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ జరిగింది. తదుపరి లక్ష్మీనారాయణ పూజ మరియు హోమ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అనంతరం వైద్యాలయ సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది సాధకులు పాల్గొని, మాస్టర్ గారి దివ్య అనుగ్రహాన్ని పొందారు.
