గురుపౌర్ణమి కార్యక్రమము
Guru Poornima
ది.29-07-2026 గురుపౌర్ణమి సందర్భంగా మాస్టర్ EK, KPK, KSS గార్ల దివ్య ఆశీస్సులతో మాస్టర్ హోమియో వైద్యాలయం అక్కయ్యపాలెం లో ఉదయం 6 గంటలకు ప్రేయరు, షోడశోపచార పూజ, పౌర్ణమి సందర్భముగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు హోమము జరిగినవి.
మధ్యాహ్నం 12 గంటల నుండి హోమియో వైద్యాలయ ప్రాంగణంలో నారాయణ సేవ 100 మందికి అన్నదానం, వస్త్రదానం జరిగినది. స్త్రీలకు చీర-జాకెట్టు, పురుషులకు పంచ-తువ్వాలు, ఇవ్వడం జరిగింది.
సాయంకాలం 6 గంటలకు ప్రేయరు 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ సత్యదేవ్, WTT Director - Services గారు నిర్వహించినారు. ఆ తరువాత గురు స్తుతి, గురుపాదుకా స్తోత్రము, గుర్వాష్టకం, పురుష సూక్తం, శ్రీ సూక్తంతో గురుపాదుకాపూజ కార్యక్రమము జరిగినది. గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ సత్యదేవ్ గారి దంపతిని శ్రీ M వెంకటేశ్వర రావు దంపతి & శ్రీ R సంజీవ Raju దంపతి సత్కరించారు. ఈ సభలో శ్రీ సత్యదేవ్ గురుప్రసాదం పుస్తకావిష్కరణ చేశారు. Master EK gari గృహవైద్యం హోమియో పుస్తకావిష్కరణ శ్రీ కె శ్రీనివాస్ చేసినారు. ఆ తరువాత శ్రీ సత్యదేవ్ గారు, శ్రీ శ్రీనివాస్, శ్రీ హనుమంతరావు గార్లు గురువు యొక్క విశిష్టత గురించి సవివరంగా తెలియజేసినారు. గురుశిష్య సాంప్రదాయం సనాతనమైనదని అందుకు నిదర్శనమే మన వేదవిద్య , రామాయణ, భారత భాగవతాల ఆయన ఉదహరించారు. గురుశిష్య సంబంధం జన్మ జన్మలదని అన్నారు.
సుమారు 130 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొని గురు అనుగ్రహమును పొందినారు. మాస్టర్ EK నీరజం, తదుపరి ప్రసాద వితరణ తో గురు పౌర్ణమి కార్యక్రమము ముగిసినది.