MASTER EK SATAJAYANTI SATSANGAM - Akkayyapalem
Master EK Centenary Celebrations
మాస్టర్ హోమియో వైద్యాలయం, అక్కయ్యపాలెం విశాఖలో, మాస్టర్ EK శతజయంతి ఉత్సవాల సందర్భంగా తేది 14.7.2026న సాయంత్రం గం|| 6.00-8.00pm వరకు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారిచే సత్సంగసభ నిర్వహించబడింది. వారిని యధోచితంగా శ్రీ దీక్షితులు, శ్రీ కోటేశ్వరరావు, శ్రీ భీమశంకర్, శ్రీ లీలాకృష్ణ, శ్రీ శశిధర్ సత్కరించారు.
నిర్వాహకులు శ్రీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ మాస్టర్ గారు చేసి చూపిన సేవా కార్యక్రమాలు అన్నియు యధాతథంగా కొనసాగుతున్నాయన్నారు. మాస్టర్ EK సంకల్పం, Dr K S Sastry గారి ఆచరణ మరియు నిర్వహణ అంతా గురుశక్తిగా భావించి మనమంతా సాధకులము మాత్రమే అని తెలిపారు.
శ్రీమాన్ ఎక్కిరాల అనంత కృష్ణగారు ప్రసంగిస్తూ గురుతత్వం, సేవ, సమర్పణ మరియు ఆచరణాత్మక, ఆధ్యాత్మిక జీవితం గురించి వివరణాత్మకంగా వివరిస్తూ గురువు అనేది ఒక వ్యక్తి లేదా శరీరం మాత్రమే కాదని జీవుల లోని పరబ్రహ్మ తత్వాన్ని మేల్కొలిపే జ్ఞానం, వెలుగు, మార్గమని వివరించారు. "నేను సేవ చేస్తున్నాను" - అనే భావం లేకుండా "నేను సేవ చేసుకుంటున్నాను" అనే వినమ్ర దృక్పథమే నిజమైన సేవ అని ఉద్బోధించారు.ఈ కార్యక్రమములకి సుమారు 100 మంది సాధకులు పాల్గొన్నారు. మాస్టర్ EK. నీరాజనం, ప్రసాద వితరణతో కార్యక్రమము ముగిసింది.