Master Homoeo Vaidyalayam, Akkayyapalem, VisakhapatnamMaster Homoeo Vaidyalayam, Akkayyapalem, Visakhapatnam — A Medical and Socio Service Centre

Newsletter

English and Telugu updates, events and stories from Master Homoeo Vaidyalayam.

← Newsletter

సత్సంగ సభ

తేది 12.09.2026, సాయంత్రం 6.00 గంటలకు, మాస్టర్ హోమియో వైద్యాలయం, అక్కయ్యపాలెంలో ప్రార్థనతో సత్సంగ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ బి.ఆర్.కె. రాజు (నవనీతం) గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ బి.ఆర్.కె. రాజు గారు మాట్లాడుతూ, కీ.శే. డా॥ కె.ఎస్. శాస్త్రి గారు ఆచరించి చూపిన సేవా కార్యక్రమాలను మాస్టర్ హోమియో వైద్యాలయ సాధకులు నేటికీ అదే స్ఫూర్తితో, భక్తి శ్రద్ధలతో యథాతథంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు.

మాస్టర్ ఇ.కె. గారు చూపిన మార్గంలో, మొదటి రోజు నుండి చివరి రోజు వరకు డా॥ కె.ఎస్. శాస్త్రి గారు గృహస్థ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, తమ కర్తవ్య పాలనను త్రికరణ శుద్ధిగా ఆచరించారని తెలిపారు.

శ్రీ నవనీతం గారు మాట్లాడుతూ, “క్రమశిక్షణకు మారుపేరు డా॥ కె.ఎస్. శాస్త్రి గారు మరియు మాస్టర్ హోమియో వైద్యాలయం, అక్కయ్యపాలెం” అని పేర్కొన్నారు.

అలాగే, “పదిమందికి ఉపయోగపడే పనిని పదిమంది కలిసి చేయడం” అనే భావనను డా॥ కె.ఎస్. శాస్త్రి గారు కేవలం బోధించడమే కాకుండా ఆచరణలో చేసి చూపించి, తమను అనుసరించే వారితో కూడా అదే విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించేలా ప్రోత్సహించేవారని వివరించారు.

శ్రీ నవనీతం గారు మాస్టర్ ఇ.కె. గారు మరియు డా॥ కె.ఎస్. శాస్త్రి గారి జీవన విధానం, సేవా తత్వం, క్రమశిక్షణ గురించి వివరించిన అంశాలు సోదర బృందానికి మరింత స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలిగించాయి.

చివరగా మాస్టర్ ఇ.కె. నీరాజనం మరియు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.