Master Homoeo Vaidyalayam, Akkayyapalem, Visakhapatnam

Newsletter

English and Telugu updates, events and stories from Master Homoeo Vaidyalayam.

← Newsletter

MASTER EK SATAJAYANTI PROGRAM :: TAGARAPUVALASA

Master EK Centenary Celebrations

Master EK శతజయంతి సందర్భంగా మరియు WTT & గీతా మందిరం వారిచే నిర్వహించబడుతున్న హోమియో వైద్యాలయ వార్షికోత్సవం ను తగరపువలస కేంద్రంలో సభ నిర్వహించడం జరిగింది. సుమారు 150 మంది సాధకులు పాల్గొన్నారు. ఈ సభకు శ్రీ BRK Raju garu, Secretary, WTT ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాస్టర్ హోమియో వైద్యాలయం అక్కయ్యపాలెం నుండి డాక్టర్ శ్రీ వంశీ గారు, శ్రీ K శ్రీనివాస్, శ్రీ హనుమంతరావు గారు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అలాగే ప్రాంతీయ గణపతి శ్రీ రమేష్ గారు మాట్లాడుతూ జరుగుతున్న కార్యక్రమాలు శ్రీ అప్పలనాయుడు మాస్టర్ గారి గూర్చి, మాస్టర్ K S Sastry గారు గురించి, Master EK చైతన్యం గూర్చి తెలియజేసినారు. 
డాక్టర్ వంశీకృష్ణ గారు ప్రసంగిస్తూ బాల్యం లోనే తన తండ్రిగారి ద్వార అనుగ్రహింపబడిన మాస్టర్ EK గారి నామమే మంత్రమై నన్ను నడిపిస్తుందని తెలియజేసినారు. శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ హనుమంతరావు గారు ప్రసంగిస్తూ మాస్టర్ EK గారి అనుంగు అనుయాయులు శ్రీ డాక్టర్ శాస్త్రి గారికి తమ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హోమియో వైద్య కేంద్రాలలో తగరపువలస కేంద్రం గత 27 సం|| అంకితభావంతో సేవ చేస్తున్నారని తెలియజేసినారు. 
శ్రీ రమేష్ గారు మాట్లాడుతూ మన హోమియో క్లినిక్ శ్రీ డాక్టర్ శాస్త్రి గారి మానస పుత్రిక అని, అప్పలనాయుడు మాస్టర్ గారి నిర్వహణలో 1999 జూలై 9న ఈ వైద్య కేంద్రం ప్రారంభించబడిన వైనం వివరించారు. మాస్టర్ EK.గారి సేవా మార్గంలో వారి దివ్య ప్రభావమే మమ్మల్ని నడిపిస్తున్నది అని తన అధ్యక్షోపన్యాసంలో ప్రసంగించారు. 
Sri Raju గారు మాట్లాడుతూ ఈ బృందం శ్రీ శాస్త్రి గారి శిక్షణలో, క్రమశిక్షణ, శరణాగతి చెంది బాగా చేసుకుంటున్నారు అని కొనియాడారు. ఇదే మాస్టర్ EK గారి విశ్వ ప్రణాళిక, విశ్వ విజ్ఞానాన్ని, ఉత్తమ సంస్కార సముపార్జనను సామాన్య ఆచార, వ్యవహారాలలో నిబిడీకృతం చేసుకున్నది భారతీయ జీవన విధానం. వేదోపనిషత్తులలోని ఈ ప్రకృతి, పరమాత్మ తత్త్వ రహస్యాలను సామాన్య భాషలో అందించిన మహనీయులు, మహర్షి, ఆచార్యులు మాస్టర్ EK గారు. వారు ఒక మార్గం, ఒక్కసారి వారి మార్గంలో ప్రవేశించి గలిగితే చాలు. అది ఆనందధామం అని అవగతం అవుతుంది అని చెప్పారు. సేవ, క్రమశిక్షణ జీవితంలో రెండు ముఖ్యాంశాలు. మనం చేసే మానవ సేవ మన కర్మ ఫలాన్ని హరించి ఉత్తమ సంస్కారాలను ప్రసాదిస్తాయి, ఆనందమయ మార్గం లోకి మళ్ళిస్తాయి. సేవ వలన శతాధిక ఫలం లభిస్తుంది. ఇంత అంకిత సేవా భావంతో మాస్టర్ EK గారి మార్గంలో, శ్రీ శాస్త్రి గారి మార్గదర్శకత్వంలో ఇరవై ఏడేళ్లగా ఈ గీతా మందిరం లో WTT వైద్యాలయం నిర్వహించబడటం ప్రశంసనీయం అని ప్రసంగించారు.